Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Jul 25, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీ హోంమంత్రి వంగలపూడి
అమరావతి, జూలై25(క్విక్ టుడే న్యూస్):
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్‌కు గురైంది. శుక్రవారం సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంట్‌ను హ్యాక్ చేసి, అందులోని అన్ని ట్వీట్లను తొలగించారు. ప్రొఫైల్ ఫొటో కూడా కనిపించకుండా చేశారు. అనంతరం ఎఫ్ఎక్స్ఆర్పీ పేరుతో క్రిప్టో కరెన్సీని ప్రచారం చేస్తూ స్పామ్ లింక్‌ను పోస్టు చేసి, "ఎర్లీ కాంట్రిబ్యూటర్ రివార్డ్స్" అంటూ సందేశం ప్రచురించారు. ఈ విషయాన్ని గుర్తించిన హోంమంత్రి కార్యాలయ సిబ్బంది వెంటనే అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే హోంమంత్రి అనిత సైబర్ క్రైమ్ ఐజీ రవికృష్ణతో మాట్లాడి ఘటనపై సమాచారం ఇచ్చారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఖాతాను హ్యాక్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.


